Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహా కల్యాణోత్సవం ..

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహా కల్యాణోత్సవం ..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి : డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో గల పాలరాతి దేవాలయంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం  శ్రీ లక్ష్మీనరసింహా స్వామి  కల్యాణోత్సవం ను ఆలయ ప్రధాన అర్చకులు  వడియాల్ రవికుమార్ ఆధ్వర్యంలో వేద పండితులు కన్నుల పండువగా  నిర్వహించారు. కళ్యాణ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని సేవించుకున్నారు.  అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పండితులు అరుణ్ కుమార్ శర్మ, సురేష్ శర్మ, కందాలై రాజగోపాల్ శర్మ , సాయి శంకర్ శర్మ, దేవి దాస్ రావు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -