- Advertisement -
ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన శివసేనా రెడ్డి
హైదరాబాద్ : ఆసియా కప్ ఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించిన తెలుగు తేజం తిలక్ వర్మకు సోమవారం హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తిలక్ వర్మకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మెన్ శివసేనారెడ్డి, ఎండీ సోనిబాల దేవి, పోలీసు శాఖ ప్రోటోకాల్ విభాగం అధికారులు అపూర్వ స్వాగతం పలికారు. ఒత్తిడిలో పాక్‌ను చిత్తు చేసే ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ తెలంగాణతో పాటు యావత్ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని శివసేనా రెడ్డి అభినందించారు.
- Advertisement -