Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ద్వితీయ శ్రేణి న్యాయమూర్తికి ఘన సన్మానం

ద్వితీయ శ్రేణి న్యాయమూర్తికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
ఇటీవల నూతనంగా బాధ్యతలు తీసుకున్న కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి టి, చంద్రశేఖర్ ను రాష్ట్ర మానవ హక్కుల సహాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి టి చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలకు వెంటనే పరిష్కారం చేస్తానని తెలియజేశారు. మానవ హక్కుల సహాయ సంఘ ప్రతినిధులను అభినందించారు.

ఈక శ్రీనివాస్ రావు న్యాయవాది మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులను  మెజిస్ట్రేట్గా, జడ్జిలుగా, ఏపీపీలుగా శిక్షణ తరగతులు నిర్వహించి నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్  ఎం కె సలీం, మహిళ రాష్ట్ర చైర్మన్ షబానా బేగం,   ఇతర న్యాయవాదులు హైకోర్టు న్యాయవాది టి నరసింహ చారి,  న్యాయవాది కే అనిత, న్యాయవాది టి.ఎన్. నారాయణ,న్యాయవాది అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -