Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థినికి ఘన సన్మానం

విద్యార్థినికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
సదాశివనగర్ మండలం ఉత్తునూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కయ్యాల శ్రీజ నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలో ఉన్న ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ)ను సందర్శించి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అంతరిక్ష శాస్త్రంపై అవగాహన పెంపొందించుకోవడంలో భాగంగా శ్రీహరి కోట ఇస్రో కేంద్రాన్ని సందర్శించడం గర్వకారణమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

విద్యార్థినిలో ఉన్న ఆసక్తి, కృషి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు దోహదపడుతుందని అభినందించి శ్రీజకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాలలో నూతనంగా ప్రారంభమైన లైబ్రరీని సందర్శించారు. విద్యార్థులు లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆమె సాధించిన ఈ అవకాశం పాఠశాలకే కాక గ్రామానికి కూడా గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వి డి సి చైర్మన్ గుడ్ల శ్రీకాంత్ రావు, విజయ డైరీ అధ్యక్షులు దొడ్లే రవి, మాజీ ఉపసర్పంచ్ శివ పాటిల్, మెడికల్ వెంకట్రావు, పబ్బ సంజీవ్, నాగులగం చిన్న వీరన్న, మనంజి శ్రీకాంత్, కిషన్ రావు, శేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -