Wednesday, October 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆశ్రుతకు ఘన సన్మానం

ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆశ్రుతకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండలం లోని రోటిగూడ గ్రామానికి చెందిన  పులిశెట్టి ఆశ్రుత నీట్ యూజీ పరీక్షలో , అత్యుత్తమ ర్యాంకు సాధించి ఫ్రీ ఎంబిబిఎస్  సీటు పొందిన సందర్భంగా, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శివశక్తి సామాజిక సంక్షేమ సంస్థ, రోటిగూడ ఆధ్వర్యంలో ఘన సన్మానం సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ ఫౌండర్, పాలాజీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అశ్రుత  ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉద్యోగం సాధించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరుతున్నామన్నారు.

గ్రామ ప్రజలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనీ ఆశ్రుత యొక్క విజయం గ్రామానికి గర్వకారణమని, ఆమె కృషి ఇతర విద్యార్థులకు ప్రేరణ కావాలన్నారు. శివశక్తి సామాజిక సంక్షేమ సంస్థ అడ్మిన్ సేపురి గోపాల్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి విజయాలు గ్రామ అభివృద్ధికి, విద్యా చైతన్యానికి దోహదం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, స్థానిక యువత, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఆశ్రుతకు శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పు శ్రీనివాస్  గ్రామస్తులు సత్యనారాయణ, మల్లే శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -