- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
మున్సిపల్ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న మల్లుగారి రాజిరెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా మంగళవారం దుబ్బాకలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కే. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో రాజిరెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కమిషనర్ రమేష్ మాట్లాడుతూ.. ఉద్యోగులు.. ప్రజల్లో ఒకరై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ తమ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, శానిటరీ ఇంచార్జ్ శ్రీకాంత్, వర్క్ ఇన్ స్పెక్టర్ బుస్స ప్రవీణ్, సిబ్బంది రాజు, శ్రీనివాస్, రాజశేఖర్, పలువురున్నారు.
- Advertisement -