నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ను ఖండేబల్లూర్ గ్రామానికి చెందిన నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఎస్సై యువకుడు కావడం వల్ల మండలంలో శాంతి భద్రతల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిత్యం ప్రజల సంక్షేమం కోరుకుంటూ విధులను యువతిస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్నారని వారు అన్నారు. గ్రామాలలో ప్రజలకు యువతకు మంచి మార్గం వైపు నడిపించే విధంగా మార్గదర్శకంగా వ్యవహరిస్తూ చెడు దోవ పట్టకుండా యువతకు మార్గ నిర్దేశం చేస్తున్నారని అన్నారు.
అదేవిధంగా మండలంలోని ప్రజలకు గ్రామస్తులకు అవగాహన చేస్తూ అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు వచ్చిన ఎస్ఐలో ఒకరిని కొనియాడారు. ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ప్రజలు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలని అన్నారు. యువత ముఖ్యంగా డ్రగ్స్ తీసుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, గ్రామాలలో పేకాట, మట్కా, వంటి అసాంఘిక కార్యకలాపాల వైపు దృష్టి మళ్లించకుండా తాను ఏది సాధించాలనుకుంటున్నాడో లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిపైనే దృష్టి మళ్లించాలని యువతకు, ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శివరాజ్ దేశాయ్, కొమ్మ రాజు, నాగనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ ఎస్సై నవీన్ చంద్రకు ఘన సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES