Friday, February 6, 2026
E-PAPER
Homeజిల్లాలుఉత్తమ ఎంపీడీవో కుమార్ కు ఘన సన్మానం 

ఉత్తమ ఎంపీడీవో కుమార్ కు ఘన సన్మానం 

- Advertisement -

మాజీ వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్, మాజీ సర్పంచులు, 
నవతెలంగాణ – నెల్లికుదురు 

నెల్లికుదురు ఎంపీడీవో సింగారం కుమార్ కు శాలువాతో ఘనంగా సత్కరిచ్చినట్లు నెల్లికుదురు మండల వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్ మాజీ సర్పంచులు పెరుమాండ్ల పెరుమాండ్ల, సుధాకర్ తెలిపారు. శుక్రవారం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాలలో గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ కార్యదర్శులతో కలసి సమావేశా నిర్వహిస్తున్నారని అన్నారు. గ్రామంలో పంచాయతీకి సంబంధించిన విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా కృషి చేసిన ఎంపీడీవోకు ఉత్తమ అధికారిగా ఎంపిక చేయడం తద్వారా జిల్లా యంత్రాంగం చేత ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న సందర్భంగా ఎంపీడీవో కుమార్కు శాలువా తో ఘనంగా సత్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి ఉత్తమ అధికారి నెల్లికుదురు మండలానికి ఉండడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి గ్రామాలకు ఏఏ విషయాలపై చేరయాల్సి ఉందో వాటిని చేరవేసి అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నందుకు కృతజ్ఞతలు అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -