Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలుగు భాషా పండితులకు ఘన సన్మానం.. 

తెలుగు భాషా పండితులకు ఘన సన్మానం.. 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
క్రీడా దినోత్సవం, తెలుగు బాషా దినోత్సవం సందర్బంగా రోటరీభవనం నందు రోటరీ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు జక్కుల రాధకిషన్ ఆధ్వర్యంలో  వ్యాయమ ఉపాధ్యాయులకు, తెలుగు బాషా పండితులకు శాలువా, మేమంటోతో శనివారం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడా  దినోత్సవం జరుపుకోవడం మన అందరికి గర్వకారణం అని అన్నారు. 

సెక్రటరీ ఖాందేశ్ సత్యం మాట్లాడుతూ.. గిడుగు వెంకట రామమూర్తి ఉపాధ్యాయులు గా, చరిత్ర పరిశోదకులుగా, విద్యా వేత్త గా పేరొందిన అయన జయంతి ని తెలుగు బాషా దినోత్సవం జరుపుకుంటున్నాం అని అన్నారు. కోశాధికారి కోట నరేష్ క్రీడా, తెలుగు బాషా దినోత్సవం పురస్కరించుకొని వ్యాయామ ఉపాధ్యాయులకు, భాష పండితులకు సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమం లో  చరణ్ రెడ్డి, సురేష్,  లక్ష్మినారాయణ, వన్నెల్ దేవి రాము,  పివిఆర్ శ్రీకాంత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad