- Advertisement -
ఎస్ఐ ఉపేంద్ర చారి 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్ర చారి అన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎస్ఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రన్ ఫర్ యూనిటీ 2కే రన్ నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యత విలువలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సర్దార్ పటేల్ కృషి మరువలేనిదని గోపి అన్నారు. భారత దేశాన్ని ఏకీకృతం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, ప్రజలకు,పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -

 
                                    