నవతెలంగాణ – ధర్మసాగర్
కేంద్ర ప్రభుత్వం మేరా యువ భారత్ వరంగల్ కేంద్రం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొర్రూరు, పెద్ద వంగర, దంతాలపల్లి, మరియు మరిపెడ బంగ్లా ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి మండలాల బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కి 15 నుంచి 29 సంవత్సరాల యువతి, యువకులు ఆయా మండలాల యువజన సంఘాలు ఈనెల 10, 11న, 9963222350,9963945620 నెంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ (నమోదు) చేసుకోవాలని, ఎంట్రీ ఫీజు లేదు, తదుపరి ఈ రెండు రోజుల క్రీడా పోటీల తేదీలను మరో ప్రకటనలో తెలుపుతామని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్, సభ్యులు రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రింద తెలిపిన విధంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించబదుతాయని వివరించారు.గ్రూప్ ఈవెంట్‌లు పురుషులకు కబడ్డీ 7 సభ్యుల టీం,మహిళలకు టగ్ ఆఫ్ వార్/తాడు గుంజే ఆట 8 సభ్యుల టీం,వ్యక్తిగత ఈవెంట్‌లు3 & 4. పురుషులు మహిళలకు అథ్లెటిక్స్ 100 మిటర్స్ పరుగు పందెం,5 & 6. పురుషులు మహిళలకు బ్యాడ్మింటన్ షటిల్ సింగిల్స్ ఈవెంట్స్ ఉంటాయి అని ఈ అవకాశాన్ని మూడు మండలాల యువత యువజన సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం వారు గెలుపొందిన వారికి ట్రోఫీ, మెడల్ & అభినందన పత్రం, రన్నర్స్ కి మెడల్ & అభినందన పత్రం ప్రోగ్రాం లో భాగస్వాములు అయిన వారందరికీ పార్టిసిపెంట్ పత్రాలు అందజేస్తామని సందర్భంగా తెలిపారు.
స్పోర్ట్స్ పై ఆసక్తి ఉన్న యువత కి గొప్ప అవకాశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



