Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్షరజ్ఞానం నేర్పే గొప్ప కార్యక్రమం అక్షరాభ్యాసం

అక్షరజ్ఞానం నేర్పే గొప్ప కార్యక్రమం అక్షరాభ్యాసం

- Advertisement -

బీరెల్లి గూడం సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ .. 
నవతెలంగాణ- మునుగోడు

చిన్నారులకు అమ్మ  అడుగులు నేర్పితే .. అదే చిన్నారులకు అంగన్వాడీలల్లో  అక్షరజ్ఞానం నేర్పేందుకు నిర్వహించే గొప్ప కార్యక్రమం అక్షర అభ్యాసం అని బీరెల్లి గూడం సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని బీరెల్లి గూడెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అక్షరాభ్యాసం  కార్యక్రమం కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై , చిన్నారులతో  అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. చిన్నారులకు బలహీనతగా ఉండకుండా అంగన్వాడీలల్లో అందించే పౌష్టికాహారాన్ని చిన్నారులకు అందిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని అన్నారు. తదనంతరం ఆరోగ్య లక్ష్మి కమిటీని ఏర్పాటు చేశారు. చిన్నారులకు సర్పంచ్ గోవర్ధన్  పలుకలను అందించారు. దోటి ధనమ్మ విజయ్ కుమార్ పప్పు కుక్కర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దోటి వెంకన్న ,గ్రామ కార్యదర్శి చిత్రం రమేష్, అంగన్వాడి టీచర్ కే నిర్మల, ఆయా జి యశోద, ఆశ డి మల్లేశ్వరి, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -