Wednesday, July 16, 2025
E-PAPER
Homeసినిమాఅంబేద్కర్‌కి గొప్ప నివాళిగా..

అంబేద్కర్‌కి గొప్ప నివాళిగా..

- Advertisement -

మన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సిద్ధాంతాల స్పూర్తితో రూపొందిన చిత్రం ‘అగ్రహారంలో అంబేద్కర్‌’. దళిత సంఘ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఈ చిత్ర టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. కృష్ణచైతన్య ఎన్నో కష్టాలు పడి, తెరకెక్కించిన
ఈ చిత్రం అసాధారణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అంబేద్కర్‌ అభిమానులైన ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ – లక్షమోజీ ఫిల్మ్స్‌ పతాకంపై మంతా కృష్ణచైతన్య హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సినిటేరియా మీడియా వర్క్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. కుల, మత, ప్రాంత, వర్గ వైషమ్యాలకు అతీతంగా సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్‌కు గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -