Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా పోరాటాలను ఉదృతం చేయడమే లతీఫ్ భాయ్ కి ఘనమైన నివాళి

ప్రజా పోరాటాలను ఉదృతం చేయడమే లతీఫ్ భాయ్ కి ఘనమైన నివాళి

- Advertisement -

-ఎండి జహంగీర్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ కె లతీఫ్ సంతాప సభ
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్

యస్ కె లతీఫ్ కమ్యూనిస్టు ఉద్యమంలో 40 సంవత్సరాలు నిరంతరం పనిచేశారని, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయడమే ఆయనకు ఘనమైన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట పట్టణం, లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్, ఈ మధ్యకాలంలో గుండె పోటుతో మరణించిన సీపీఐ(ఎం) పట్టణ నాయకులు ఎస్ కె లతీఫ్ సంతాప సభ పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు లతీఫ్ భాయ్ చిత్ర పటానికి పూల మాల వేసి జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో యండి జహంగీర్ మాట్లాడుతూ కమ్యూనిస్టు లీడర్ ను తయారు చేయాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది, ఒక నాయకత్వ స్థాయికి వచ్చిన తర్వాత అతను కాస్తా దూరమైతే దాని ప్రభావం పార్టీ మీద, సమాజం మీద, కుటుంబం మీద ఉంటుంది అన్నారు. ఆయన లేని లోటును పూడ్చలేనిది అన్నారు. పట్టణంలో, మండలంలో, జిల్లా మైనారిటీ ఆర్గనైజేషన్ లో, వివిధ రంగాలలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నాయకుడు లతీఫ్ అని తెలియజేశారు. కమ్యూనిస్టులు వ్యవస్థను మార్చాలని లక్ష్యంతో పనిచేస్తారని అన్నారు. వ్యవస్థలో ఉన్నటువంటి శ్రామికుల్ని, పేదలను ప్రభుత్వాలు ఐక్యం కానివ్వడం లేదని వారిని ఐక్యం చేసే పని కమ్యూనిస్టులుగా చేస్తున్న పనిలో లతీఫ్ భాయ్ పాత్ర ఉందన్నారు. లతీఫ్ నాయకుడిగా ఉంటూ, సందర్భం వచ్చినప్పుడు కార్యకర్త పాత్ర కూడా పోషించారని అన్నారు.

లతీష్ ఎన్నడు గర్వం చూపించలేదు. పార్టీ గీసిన గీతను దాటలేదు. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి, ప్రజలను సమీకరించడంలో, సమస్యల మీద స్పందించడంలో లతీఫ్ యొక్క పాత్ర చాలా ప్రముఖమైనది అని అన్నారు. సమాజంలో అందరూ గర్వించే స్థానంలో ఉన్నారు. ఈ సమాజంలో కార్పొరేటిజం, కన్జ్యూమెరిజం రెండు డామినేట్ చేస్తున్నాయని అన్నారు. ప్రతీది వ్యాపారంతో చూసే ధోరణి పెరిగిందన్నారు. ఈ పరిస్థులలో ప్రజలను సమీకరించి పోరాటాలను ఉదృతం చేయడం ద్వారా మాత్రమే ఆయన ఆశించిన సమాజం వస్తుందని తెలియజేశారు.

ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, కల్లూరి మల్లేశం, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బబ్బూరి శ్రీదర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీస కృష్ణ , డి వై ఫ్ ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, పి ఎన్ ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, తుర్కకాశ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇమామ్ పాషా, సీపీఐ(ఎం) మండల నాయకులు బబ్బూరి శ్రీను, పట్టణ నాయకులు ఈశ్వర్ రెడ్డి, యస్ కె షరీఫ్, ఆర్ టి సి మాజీ ఉద్యోగులు ఆర్ నర్సయ్య , లింగమయ్య, హమాలీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చుక్కల కృష్ణ, బండ శ్రీశైలం, నాయకులు కంబాల స్వామి, లతీఫ్ భాయ్ కుటుంబ సభ్యులు అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -