- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డిని ఆయన ఇంటి వద్ద మాచారెడ్డి మండల జిపిఓల సంక్షేమ సంఘం అధ్యక్షులు సిద్ధం కిషన్ తోపాటు పలువురు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ… వీఆర్ఏలుగా పని చేసినప్పుడు, దీర్ఘకాలికంగా ధర్నాలు చేసినప్పుడు వీఆర్ఏలకు మద్దతు తెలిపి, వెన్నంటి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అదే వీఆర్ఏలను గ్రామ పరిపాలన అధికారులు గా నియమించినందుకు, ఇచ్చిన మాట నిండా పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గిద్ద తదితర గ్రామస్తులు ఉన్నారు.
- Advertisement -