- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
బీసీ డిక్టరేషన్ అమలు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 15 న కామారెడ్డి పట్టణంలో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పై నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రానికి ఐదుగురు మంత్రుల బృందం చేరుకుంది.మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వాకాటి శ్రీహరి , ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం, డిగ్రీ కళాశాల మైదానాలను పరిశీలించారు.
- Advertisement -