Friday, October 24, 2025
E-PAPER
Homeజిల్లాలుఅడవులను వదిలి గ్రామాలలోకి వానరసమూహం

అడవులను వదిలి గ్రామాలలోకి వానరసమూహం

- Advertisement -

నవతెలంగాణ – తిప్పర్తి
కోతుల బెడదతో రహదారుల వెంట ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు రాష్ట్రంలో రోజు రోజుకు కోతుల సమూహాలు అడవులను విడిచి జన సమూహంలోకి రావడం వలన ప్రజలు రహదారుల వెంట వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారి వెంట నడుచుకుంటూ వెళ్లాలన్నా, ద్విచక్ర వాహనంపై వెళ్లాలన్న కోతుల వలన ప్రయాణికులు అవస్థలు పడవలసిందే. నిలిచి ఉన్న వాహనాల పైకి ఎక్కి డ్రైవింగ్ చేయడం, అద్దాలలో చూసుకుంటూ పోట్లాడటం మనం చాలా సన్నివేశాలలో చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా కోతులు ఆకలితో అలమటిస్తూ రోడ్ల వెంట పడేసిన వ్యర్ధాలు తింటూ అది చాలక షాపులపై దాడి చేయడం, ఒంటరిగా వెళుతున్న ప్రయాణికులపై దాడి చేయడం కోతులకు ఫ్యాషన్ గా మారిపోయింది.

గ్రామీణ ప్రాంతాలలో ఒంటరిగా ఉన్నటువంటి ఆడవారి పైన, చిన్న పిల్లల పైన కోతులు దాడులు చేస్తూ వారిని గాయపరుస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ఆహారాలను తీసుకుంటూ కడుపు నింపుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హరితహారం (కోతుల హారం) కింద పండ్ల మొక్కలను నాటించినప్పటికీ వాటికి సరైన రక్షణ లేకపోవడం వలన అడవులు పెరగకపోవడం వాటికి సరైన ఆహారం దొరకక జన ఆవాసాల పైన ఆధారపడుతున్నాయి. రైతులు తమ పండ్ల తోటలను, పంట పొలాలను కోతల నుంచి కాపాడుకోవడానికి అవస్థలు పడవలసి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండ్ల తోటలను,అడవులను పెంచే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేపట్టకపోతే జనాలు వాటి వలన తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని కొందరు ప్రయాణికులు తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -