Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్..

మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్..

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ
చేసే వృత్తి ఊరుకొండ హెడ్ కానిస్టేబుల్ అయినప్పటికీ.. ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజీ పలువురికి ఆదర్శం. ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన గడ్డం మహేందర్ గుండెపోటుతో మృతి చెందాడు. అందరితో కలిసిమెలిసి కలుపుగోలుగా ఉండే మహేందర్ మరణ వార్త విన్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన వంతుగా 3వేల ఆర్థిక సాయం అందజేయడంతో పాటు దిశదినకర్మకు బియ్యం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మహేందర్ మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ బాదిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -