- Advertisement -
- – వైద్యురాలు మాధురి
- – ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన..
- నవతెలంగాణ – బెజ్జంకి
- ఆరోగ్యవంతమైన మహిళ..కుటుంబానికి భరోసా వంటిదని వైద్యురాలు మాధురి అన్నారు.స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో బాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన ఆరోగ్య వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి ధన్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైద్యులు మాధురి,తహాసిన్ నసీమున్నిషా పర్యవేక్షణలో నిర్వహించిన ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 8 మంది వైద్యులు ప్రజలకు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వాస్పత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మాధురి సూచించారు. మహిళల ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఆరోగ్య శిబిరం ప్రధానోద్దశ్యమని డాక్టర్ మాధురి తెలిపారు. ఆరోగ్య కేంద్రం సిబ్బంది సులోచన,ఎఎన్ఎంలు,ఆశావర్కర్లు పాల్గొన్నారు.
- Advertisement -