Friday, January 2, 2026
E-PAPER
Homeకరీంనగర్హోంగార్డ్ కు ఆత్మీయ వీడ్కోలు

హోంగార్డ్ కు ఆత్మీయ వీడ్కోలు

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 31 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఎన్. మధును జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ చంద్రయ్య పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..జిల్లా పోలీస్‌ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన మీ సేవలు మరువమని, పదవి విరమణ చేసిన అనంతరం  కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని, ఎలాంటి సమస్య వచ్చిన తమని సంప్రదించ వచ్చని పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -