కొందరు మనల్ని వదలకుండా ఉన్నట్టు ఉండి,
ఓ దాకా తోడుగా కనిపించి… ఒక్కసారిగా దూరమై పోతారు.
వెళ్లిపోయినవాళ్లు వెళ్లిపోయారు అనుకుంటాం…
కానీ ఉంటూన్న వాళ్లకు వాళ్ల జ్ఞాపకాలతో మనసు నరకాన్నే అనుభవిస్తుంది.
ఎంతగా విలపించినా, తిరిగి రారని తెలుసు….
బాధకి ఎటువంటి ఫలితం లేదని కూడా తెలుసు…
కానీ మనసు మాత్రం వినదు, అమ్మని కోల్పోయిన పసిబిడ్డలా…
ఊపిరాడని నిస్సహాయతతో ఏడుస్తూనే ఉంటుంది.
‘కాలమే గాయం మాన్పుతుంది ‘ అనేదంతా ఓ కోరం మాటే…
ఇది గాయాన్ని మానించదు, కేవలం మరుగున పెడుతుంది.
ఆ గాయం మరోసారి తాకినప్పుడు వచ్చే బాధ…
ఎవరూ చూడలేరు, కానీ అనుభవించే వాడికి మాత్రమే ఆ లోతు తెలియజేస్తుంది…
ఇది హదయంలో చాపలు కట్టిన మౌనమై మారిపోతుంది
కానీ ప్రతి సారి శ్వాస తీసుకుంటూ… ఆ బాధను మళ్లీ మళ్లీ జీర్ణించుకోవాలి
తనూజ వెంకట్, 9901270639