రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
బుధవారం ఆలేరు పట్టణంలోని కాటమయ్య బస్తీ ఊరు చివర ప్రాంతంలో పందుల గుంపు స్వైర విహారం చేసి కోయడానికి సిద్ధంగా ఉన్న వరి పంట పొలం నాశనం చేశాయి. నష్టపోయిన ప్రాంతాన్ని సీపీఐ(ఎం) నాయకులు వరి పంటలు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఎ ఇక్బాల్ మోరిగాడి రమేష్ లు మాట్లాడుతూ.. పట్టణంలోని కాటమయ్య బస్తీలో చిన్నం రాములు తనకున్న రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరం చేతికి వచ్చిన వరి పంటను గత రెండు రోజుల్లో పందులు నామరూపాలు లేకుండా తినేశాయని తెలిపారు. కనీసం వడ్ల గింజ సైతం పొలంలో కనిపించని పరిస్థితి ఉందని బాదితుడు ఆవేదన తో కన్నీరు పెట్టినట్లుగా వారు తెలిపారు. వరి పక్కనే ఉన్న పత్తి పంటను సైతం పందులు నాశనం చేశాయని, చిన్నం రాములు పొలంతో పాటు మోరిగాడి శ్రీను, జలంధర్, వల్లపురెడ్డి, సాయిరెడ్డి, మోరిగాడి బాలయ్య, ఘనగాని మల్లేష్, రాజబోయిన జలంధర్ లకు సంబంధించిన దాదాపు పది ఎకరాల వరి పంటను పందులు నాశనం చేసినట్టు వారు తెలిపారు.
రైతులకు జరిగిన అన్యాయాన్ని స్థానిక తహసిల్దార్ ఆంజనేయులుకు విన్నవించి, వరి పొలం నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి అనేక విధి వైపరీత్యాలకు తట్టుకొని పంట చేతికి వచ్చిన సమయంలో నష్టపోవడం రైతులు తీవ్ర ఆవేదన గురవుతున్నారని తెలిపారు. పందుల సమస్యను పరిష్కరించాలని అన్నారు. పందులు యజమానులను పిలిచి వారిని బహిరంగ ప్రదేశంలో పందుల పెంపకంపై నివారించాలని గతంలో అనేకసార్లు అధికార దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు నిమ్మకు నినెత్తినట్లు ఉండడం వల్ల రైతులు ఈరోజు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే పంట నష్టపోయిన పొలాలను పరిశీలన చేసి రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని కోరారు. లేనియెడల బహిరంగ ప్రదేశంలో పందులను పెంచుతున్న వ్యక్తుల నుండి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు వడ్డేమాన్ బాలరాజు, మొరిగాడి మహేష్ , మొరిగాడి బాలయ్య, కావడీ రామచంద్రయ్య, మొరిగాడి అంజయ్య, జలంధర్ రామచంద్రయ్య, మొరిగాడి అంజయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.




