Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విధ్వంసానికి గురవుతున్న చరిత్ర కలిగిన కోట 

విధ్వంసానికి గురవుతున్న చరిత్ర కలిగిన కోట 

- Advertisement -

నవతెలగాణ – రాయపర్తి 
రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి 200 సంవత్సరాల చరిత్ర కలిగిన రాతికోట (గడి) నవాబ్ వారసులము అని చెప్పుకుంటున్న వారి వల్ల విద్వంసానికి గురవుతుందని రాయపర్తి గ్రామ పరిరక్షణ కమిటీ సభ్యులు సోమవారం మండల కేంద్రంలోని మండల మెజిస్ట్రేట్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయపర్తి మండలానికి తలమానికంగా నిలుస్తున్న రాతికోటను కొంతమేర ధ్వంసం చేసి అందులోని మట్టిని అమ్ముకోవడం బాధాకరం అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆస్తి అని దీనిపై ఎవ్వరు అజమాయిషీ చేసిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కోరారు. చరిత్ర కలిగిన కోటను పురావస్తు శాఖ వారికి కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ రావుల భాస్కర్ రావు, ముద్రబోయిన సుధాకర్, ఉబ్బని సింహాద్రి తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -