Sunday, March 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'ప్రేయసిరావే' రేంజ్‌ హిట్‌ ఖాయం

‘ప్రేయసిరావే’ రేంజ్‌ హిట్‌ ఖాయం

- Advertisement -

రాజేంద్రప్రసాద్‌, పృథ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌, మణి చందన ప్రధాన పాత్రల్లో దర్శకుడు మహేష్‌ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేష్‌ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి ‘ప్రేయసి రావే’ టీంతోపాటు హీరో శ్రీకాంత్‌, పృథ్వీ, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ, ”ప్రేయసి రావే’ కంటే ముందు నేను చేసిన కొన్ని చిత్రాలు సరిగ్గా ఆడలేదు. చంద్ర మహేష్‌ నాతో తీసిన ‘ప్రేయసి రావే’ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా కథ గురించి కూడా నాకు మహేష్‌ చెప్పాడు. మూడు డిఫరెంట్‌ కథలతో ఈ మూవీని అద్భుతంగా తీశాడని అర్థం అవుతోంది. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఈ సినిమాని చూడాలి. ఈ మూవీ మా ‘ప్రేయసిరావే’ రేంజ్‌లో హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్ని అన్నారు.

”ప్రేయసి రావే’ నాకు ఈ లైఫ్‌ ఇచ్చింది. ఆ టీంతో ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘ప్రేయసి రావే 2’ కథ కూడా రెడీ చేశాను. ‘ప్రేయసి రావే’ చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఫీల్‌ అయితే వచ్చిందో.. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ టైంలోనూ అదే ఫీలింగ్‌ వచ్చింది. ఇప్పటి వరకు మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ క్లైమాక్స్‌కి ఎమోషనల్‌ అయ్యారు. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు. శ్రీరామ్‌ గొప్ప డైలాగ్స్‌ రాశారు. ముగ్గురు నిర్మాతలు నాకెంతో సహకరించారు. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలతోనే ఈ మూవీని చేశాం. సినిమాని చూస్తే ఇది మా ఇంట్లోనే జరిగినట్టు ఉందే అని ఫీల్‌ అవుతారు’ అని దర్శకుడు మహేష్‌ చంద్ర చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -