Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటిక్కెట్‌ ఇవ్వలేదని రోడ్డుకు గొయ్యి..?

టిక్కెట్‌ ఇవ్వలేదని రోడ్డుకు గొయ్యి..?

- Advertisement -

– చొక్ల తండాలో వినూత్నంగా నిరసన
నవతెలంగాణ- మరిపెడ

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డుకు కాంగ్రెస్‌ పార్టీ తరపున కౌన్సిలర్‌ టిక్కెట్‌ ఇస్తానని డిపాజిట్‌ తీసుకొని టిక్కెట్‌ ఇవ్వకుండా మోసం చేసినట్టు బాధితులు బానోత్‌ దావుబుజ్జి, వారి కుమారులు నరేష్‌, సురేష్‌ ఆరోపించారు. బుధవారం టిక్కెట్‌ ఆశించి బంగపడ్డ బాధితులు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మరిపెడ మున్సిపల్‌ చొక్ల తండాలో అయ్యప్ప స్వామి గుడి నుంచి తండాకు వెళ్లే రోడ్డుకు గండిపెట్టి(గొయ్యి తీసి) నిరసన తెలిపారు. తండా ప్రజలకు రోడ్డు కావాలని తమ వ్యవసాయ భూమిని రోడ్డు కోసం ఇచ్చినట్టు చెప్పారు. ఊరు కోసం సాయం చేస్తే తమకేం దక్కిందని, ఇక్కడి నుంచి ఎవరూ నడవొద్దని, ఇది తమ భూమి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నామని, అయినా తమకు టికెట్‌ ఇస్తామని డిపాజిట్‌ పెట్టాలంటూ ఒత్తిడి చేయడంతో లక్షల రూపాయలు నగదు పార్టీ నేతల దగ్గర పెట్టినా బీఫామ్‌ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చారని వాపోయారు. అంతేగాక, ఒక మహిళ అని కూడా చూడకుండా తమ తల్లిని అవమానపరిచారని ఆరోపించారు. తమకు ఏమైనా జరిగితే పార్టీ నాయకులే బాధ్యత వహించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -