Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం ఏర్పాటు చేయాలి

వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం ఏర్పాటు చేయాలి

- Advertisement -

– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  
: చౌటుప్పల్ పట్టణంలో బాలుర  కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు అన్నారు. సోమవారం రోజున ఆయన  ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల అధ్యక్షులు దాసరి ప్రకాష్ తో కలిసి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ హైదరాబాద్ అతి దగ్గరలో ఉన్న చౌటుప్పల్ పట్టణంలో కళాశాల వసతి గృహం లేక విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఉందని, చౌటుప్పల్ పట్టణంలో పది నుండి 12 డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఉన్నాయని, మారుమూల గ్రామాల నుండి విద్యార్థులు రోజు మూడు వేల నుండి 5000 మంది విద్యార్థులు చదువుకోవడానికి చౌటుప్పల్ పట్టణానికి వస్తుంటారని అన్నారు. 

 గ్రామాల నుండి సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థుల సమయానికి కళాశాలలకు చేరుకునే పరిస్థితి లేదు,కళాశాల వసతిగృహ ఉంటే  విద్యార్థులు  చదువులు అభ్యసించడం జరుగుతా ఉన్నది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి చౌటుప్పల్ పట్టణంలో కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -