Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభారీ సంగీత యాత్ర

భారీ సంగీత యాత్ర

- Advertisement -

విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగురవేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు సంగీత దర్శకుడు రమణ గోగుల. మెల్‌బోర్న్‌- మామా క్రియేటివ్‌ స్పేస్‌, టాప్‌ నాచ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆస్ట్రేలియా సంయుక్తంగా ‘ఇన్‌ కాన్వర్సేషన్స్‌ విత్‌ ది ట్రావెలింగ్‌ సోల్జర్‌ – రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్‌ ఫిబ్రవరి 2026’ పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి. రమణ గోగులతో పాటు, ఎక్సెల్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామ్‌ కట్టాల, మెల్‌బోర్న్‌ మామా క్రియేటివ్‌ స్పేస్‌ వ్యవస్థాపకుడు సతీష్‌ వర్మ.. ఈ వరల్డ్‌ టూర్‌ వివరాలను మీడియాకి వెల్లడించారు.

ఇది కేవలం సంగీత కచేరీలకు మాత్రమే పరిమితం కాదు. రమణ గోగుల ఐకానిక్‌ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరితమైన అన్వేషణ అని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఒక వినూత్నమైన ‘డాక్యు-మ్యూజికల్‌ సిరీస్‌’ను రూపొందిస్తోంది. ఓ భారీ సంగీత ఉద్యమంలా 2026 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనతో ఈ ప్రపంచ యాత్ర ప్రారంభమవుతుంది. తదుపరి దశల్లో యూకే, అమెరికా పర్యటనలు ఉంటాయి. ఈ మ్యూజికల్‌ జర్నీ ప్రవాస భారతీయులను కళ, కథల ద్వారా ఏకం చేయడమే లక్ష్యంగా సాగనుంది అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -