Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టపగలు భారీ వృక్షం మాయం

పట్టపగలు భారీ వృక్షం మాయం

- Advertisement -

అటవీ శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
నవతెలంగాణ – తిమ్మాజిపేట

మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న భారీ వృక్షం రెండు శతాబ్దాల పైగా ఎంతో మందికి ఎండకు వర్షానికి నీడను ఇచ్చింది. అయితే ఈ భారీ వృక్షాన్ని కొందరు అక్రమార్కులు మాయం చేశారు. శుక్రవారం విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ముబారక్, మాధవులు జిల్లా అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. భారీ వృక్షాన్ని నరికిన స్థలాన్ని అడవి శాఖ అధికారి గౌస్ ఉద్దీన్ పరిశీలించారు. నరికి వేయబడ్డ వృక్షం రెండు మీటర్ల వెడల్పు ఉంటుందని, వెంటనే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొని నష్టపరిహారాన్ని సేకరిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -