Sunday, March 22, 2026
E-PAPER
Homeసినిమాభిన్నంగా 'వంద దేవుళ్లు'

భిన్నంగా ‘వంద దేవుళ్లు’

- Advertisement -

విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎన్ని రికార్డుల్ని క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే చిత్రం రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్‌ కార్పోరేషన్‌, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్‌, బాలాజీ శక్తివేల్‌, దివాకర్‌, అరుళ్‌ దాస్‌, బక్స్‌, వినోదిని, మునిష్‌ కాంత్‌, కొడంగి వడివేలు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. తాజాగా విష్ణు మంచు ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. చెరుకు తోటలో విజయ్ ఆంటోనీ కత్తి పట్టుకున్న తీరు, వెనకాలే స్వాసిక మాసీ లుక్‌తో ఉన్న ఈ పోస్టర్‌ అందర్నీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -