- Advertisement -
– సంయమనం పాటించండి: ఆర్డీఓ మధు
నవతెలంగాణ – అశ్వారావుపేట
భూమి ఎవరిదైనా ఎటూ పోదు అని, అలా అని అడవులు నరికితే నష్టపోయేది సమాజమేనని ఆర్డీఓ మధు అన్నారు. రామన్నగూడెం లో స్థానిక గిరిజన రైతులకు అటవీ అధికారులకు మధ్య నలుగుతున్న భూ వివాదం పై సోమవారం ఆయన అటవీ అధికారులు, గిరిజనులతో సమావేశం నిర్వహించారు. రెవిన్యూ – ఫారెస్ట్ శాఖల సంయుక్త సర్వే నిర్వహించే వరకు గిరిజనులు సమయమనం పాటించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,సర్వేయర్ నాగరాజు,ఎఫ్డీఓ దామోదర్ రెడ్డి,ఎఫ్ఆర్ఓ మురళీ,టీజీ ఎఫ్ డీసీ డీఎం లు గణేష్,రాంమోహన్,పీఎం చంద్రకళ,సీఐ నాగరాజు రెడ్డి లు పాల్గొన్నారు.
- Advertisement -