- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీ జెండా, ఎజెండాలో నీలిరంగు ఉంటుందని శనివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తమ దర్శనికతకు, మాట ఇస్తే తుది వరకు కట్టుబడి ఉండే నమ్మకత్వానికి నీలం రంగు చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 25న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వేషన్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు కవిత శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా నిజామాబాద్‌లో ప్రకటించారు.
- Advertisement -



