Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైన్స్ తోనే విజ్ఞానవంతమైన సమాజం: ఎంఈఓ జే. ప్రభుదాస్ 

సైన్స్ తోనే విజ్ఞానవంతమైన సమాజం: ఎంఈఓ జే. ప్రభుదాస్ 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 
మూఢనమ్మకాలనే అజ్ఞానాన్ని వీడి.. సైన్స్ అనే విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణ దిశగా అడుగులు వేయాలని మండల విద్యాధికారి (ఎంఈఓ) జోగు ప్రభుదాస్ అన్నారు. సరికొత్త పరిశోధనలతోనే దేశం పురోగతి చెందుతుందని, అది కేవలం సైన్స్ తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం దుబ్బాక మున్సిపల్ పరిధి లచ్చపేట వార్డులోని మోడల్ స్కూల్లో ‘ జన విజ్ఞాన వేదిక’ (జేవీవీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో ‘ భాగంగా మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్న 8- 10 వ తరగతి విద్యార్థులకు ఈ టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జీవీవీ కన్వీనర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్. బుచ్చిబాబుతో కలిసి ఎంఈఓ ప్రభుదాస్ మెమెంటో లతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. టీచర్లు పవన్, ఎన్సీసీ కోఆర్డినేటర్ గాజుల రామచంద్రం , లక్ష్మీనర్సు, రాధారి నాగరాజ్, జ్యోతి, మదన్మోహన్, నరేష్, శంకర్,సీఆర్పీ నవీన్ పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -