సర్కారుకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సాప్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి చూస్తే అంతా భేషుగ్గానే కనబడుతోందని హైకోర్టు పేర్కొంది. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అభిప్రాయపడింది. వారి దుస్థితి అసంఘిత కార్మికుల మాదిరిగా వారి దుస్థితి ఉందని తెలిపింది. భారీ జీతభత్యాలు, ఆకర్షణీయమైన సౌకర్యాలు, విలాసవంతమైన వసతులు ఉన్నప్పటికీ వాళ్ల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని పేర్కొంది. దేశ ఆర్థిక పురోగతిలో కీలకపాత్ర పోషిస్తున్న సాప్ట్‌వేర్ ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను అతిగా వినియోగించుకోవడం వల్ల 60 ఏండ్లకు రావాల్సిన అనారోగ్య సమస్యలు 30 ఏండ్లకే వస్తున్నాయని గుర్తు చేసింది. ఐటీ, హెల్త్ బీమాలను ఏండ్ల తరబడి చెల్లించిన వాళ్లకు చివరికి అవి లేకుండా పోతున్నాయని చెప్పింది.
సాప్ట్‌వేర్ ఉద్యోగులకు సామాజిక భద్రత, ఆరోగ్య భద్రతల కోసం చట్టాలు చేయాల్సిన అవసరముందని గుర్తు చేసింది. జీవన విధానానికి విరుద్ధంగా విధులను నిర్వహించే వారి కోసం చట్టాలను చేయాలని ప్రభుత్వాలకు సూచించింది. అగ్రిమెంట్ షరతులకు విరుద్ధంగా రాజీనామా చేస్తున్నందుకు రూ. 5.9లక్షల పరిహారం చెల్లించాలని ఐటీ కంపెనీ డిమాండ్ చేయడంపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేసే చర్యలు లేవంటూ సాప్ట్‌వేర్ ఉద్యోగి రాజేశ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ బీమపాక పైవిధంగా స్పందించారు. కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం ఒక వ్యక్తిని చట్టబద్ధమైన వృత్తి, వ్యాపారం, వాణిజ్యం చేపట్ట కుండా నిరోధించేందుకు వీల్లేదన్నారు. పిటిషనర్ 2019లో ఉద్యోగంలో చేరినప్పుడు అగ్రిమెంట్ పేపర్‌పై సంతకం చేశారని తెలిపారు. 2022 వరకు ఉద్యోగం చేశారని, అందుకు అనుగుణంగా అగ్రిమెంట్‌ను పెంచారని తప్పుపట్టారు. దీనిపై కార్మిక శాఖ చట్టాలను అమలు గురించి చర్యలు తీసుకోవాలన్నారు. విజయ బ్యాంక్ వర్సెస్ ప్రశాంత్ బి.నర్నవారే కేసులో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావించారు. ఈ కేసులో పిటిషనర్ చెల్లించాలన్న పరిహారాన్ని కంపెనీ ఏ ప్రాతిపదికన నిర్ణయించిందో, తేల్చాలని కార్మిక శాఖను ఆదేశించారు. పిటిషనర్ రాజీనామాను ఆమోదించాలంటూ కంపెనీని ఆదేశించారు.
ఉద్యోగుల సామాజిక భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు ఆ ఉద్యోగులపై అధ్యయనం చేయాలని సూచించారు. వారి హక్కుల రక్షణ కోసం చట్టాలు చేయాలని సూచించారు. చట్టబద్ధ ఆరోగ్య రక్షణ, ఏకపక్షంగా ఉద్యోగులను తొలగించడంపై ప్రభుత్వాలు చట్టాలను చేయాలన్నారు. విదేశీ మారక ద్రవ్యానికి తోడ్పడుతున్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు సామాజిక భద్రత కల్పన ఎంతో అవసరమని చెప్పారు. కాంట్రాక్టు చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం అగ్రిమెంట్ అమలుకు వీల్లేదని తెలిపారు. 2019లో పిటిషనర్ విధుల్లో చేరారు. 2022 వరకు పని చేశారు. ఎప్పటికప్పుడు అగ్రిమెంట్‌ను పెంచుకుంటూ చట్ట నిబంధనలను తప్పించుకునే ప్రయత్నం కంపెనీ చేసిందని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలను కార్మిక చట్టాలను అమలు చేస్తున్నాయో, లేదో కార్మిక శాఖ ఆఫీసర్లు సమీక్షించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసులో కంపెనీ ఏ ప్రాతిపదికన కంపెనీ పరిహారం నిర్ణయించిందో, తేల్చాలని కార్మికశాఖను ఆదేశించారు. పిటిషనర్ రాజీనామాను ఆమోదించాలని ఐటీ కంపెనీని ఆదేశించారు.
భూమి అన్యాక్రాంతం కాకూడదు : హైకోర్టు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో నాలుగు ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సర్వే నెంబర్ 859, 860లోని విలువైన నాలుగు ఎకరాల భూమిని ప్రయివేటు పార్టీల వశం కాకుండా చూడాలని ఆదేశించింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో హాస్టళ్లు, పాఠశాల భవనాలు, ఆటస్థలాలు, ఇతర సౌకర్యాలకు మాత్రమే ఆ భూమిని వినియోగించాలని ఆదేశించింది. ఈమేరకు రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, మోత్కూర్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మినీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం కోసం ఏ రవికుమార్‌తోపాటు మరో వ్యక్తి ఆరు ఎకరాలను దానంగా ఇచ్చారు. అందులో రెండు ఎకరాలను వినియోగంలోకి తెచ్చారు. మిగిలిన నాలుగు ఎకరాలను తమకు ఇచ్చేయాలంటూ వారిద్దరూ పిటిషన్ వేయగా గతంలో సింగిల్ జడ్జి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ విచారించింది. మిగిలిన నాలుగు ఎకరాల భూమిని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. ప్రైయివేట్ వ్యక్తుల స్వాధీనం కాకూదని చెప్పింది. భూమి అన్యాక్రాంతం కాకుండా కంచె వేయాలని అధికారులను ఆదేశించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. అప్పీల్‌తోపాటు ఇదే అంశంపై దాఖలైన పిల్‌ను డివిజన్ బెంచ్ విచారణకు అనుమతించింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల హక్కుల రక్షణకు చట్టం తేవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



