నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామంలోని నల్లచెరువు సమీపంలో శనివారం మధ్యాహ్నం మక్కల లోడ్ తో వెళ్తున్న లారీ రోడ్డుకు ఒక పక్కగా ఒరిగింది. చెరువు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా తడిసిన ధాన్యాన్ని బీటీ రోడ్డుపైనే కుప్పలుగా ఉంచారు. కొద్ది దూరంలోనే తూకం జరిగిన మొక్కజొన్న సంచులను కూలీలు లారీలో లోడ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉప్లూర్ గ్రామం నుండి కమ్మర్ పల్లి వైపు వస్తున్న మక్కల లోడ్ లారీ వెళ్తుంది. చెరువు సమీపంలో రోడ్డుకు ఒకపక్కగా ధాన్యం కుప్పలు ఉండడంతో లారీ డ్రైవర్ లోడుతో ఉన్న లారీని రోడ్డు కిందకు దించడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడిసి ఉన్న భూమిలోకి లారీ వెనక చక్రాలు దిగబడి, లారీ ఒకపక్కగా ఒరిగింది. గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీ నుండి కిందకు దిగేశారు. లారీ దిగబడిన ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఉంది. ఏమాత్రం పొరపాటు జరిగిన విద్యుత్ స్తంభం విరిగి లారీ పైన పడి పెను ప్రమాదం జరిగేది. భూమిలో దిగబడి ఒక పక్కకు ఒరిగిన లోడ్ తో ఉన్న లారీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రోడ్డు పక్కకు ఒరిగిన మక్కల లోడ్ లారీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



