భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రయాణికుల ఇబ్బందులు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఓ కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సంక్రాంతికి తమ సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి విజయవాడకు కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లారీ నుంచి కర్రలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీని రప్పించి లారీని పక్కకు తరలించారు.
జాతీయ రహదారిపై లారీ బోల్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



