Monday, June 2, 2025
E-PAPER
Homeసినిమా'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'

‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’

- Advertisement -

హీరో నరేష్‌ అగస్త్య నటించిన తాజా చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. సునేత్ర ఎంటర్టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై ఉమా దేవి కోట నిర్మిస్తున్నారు. విపిన్‌ దర్శకత్వం వహించిన కంటెంట్‌-రిచ్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా ఇది. ఫస్ట్‌-లుక్‌ పోస్టర్‌తో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేసిన తర్వాత మేకర్స్‌ లేటెస్ట్‌గా టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కథ ఒక ప్రతిభావంతమైన సంగీతకారుడి చుట్టూ తిరుగు తుంది. అతడు ఒక గొప్ప ఆల్బమ్‌కి స్ఫూర్తి పొందేందుకు ప్రశాంత మైన పర్వతప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని కలుస్తాడు. ఈ ఇద్దరి జర్నీ హదయానికి హత్తుకునే బంధాన్ని తెరపై టీజర్‌ అద్భుతంగా ఆవిష్కరించింది. డైరెక్టర్‌ విపిన్‌ మాట్లాడుతూ, ‘ఇది చాలా క్లీన్‌ ఎంటర్టైనర్‌. చూసినప్పుడు మంచి ఫీలింగ్‌ వస్తుంది’ అని తెలిపారు. ‘చిన్నప్పటి నుంచి నాకు కథలు రాయడం ఇష్టం. పత్రికలకి కథలు రాసి బహుమతులు కూడా అందుకున్నాను. మంచి సినిమాలు తీయాలని ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ స్థాపించాను. ప్రతి సినిమాలో కళని కనెక్ట్‌ చేయాలనేది నా ఆశ. అందుకే ఈ సినిమాని మొదట మ్యూజిక్‌కి ఇంపార్టెన్స్‌ ఇచ్చేలాగా తీశాం. ఈ సినిమాని సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం చేస్తున్నాను. కోయంబత్తూర్‌లోని ఒక హిల్‌ స్టేషన్‌లో ఈ సినిమాని చిత్రీకరించాం’ అని నిర్మాత ఉమాదేవి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -