- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుండి హైదరాబాద్ బయలుదేరిన మాధవి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సుకు ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. వెంటనే ఎమర్జెన్సీ డోర్ తెరచి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు.
- Advertisement -



