నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ గుడి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం,శంకర్‌గా పిలువబడే సుమారు 45–50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తి గత కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.శనివారం మధ్యాహ్నం సమయంలో గుడి సమీపంలోని హాల్లో అపస్మారక స్థితిలో కనిపించగా పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.ఎండల ప్రభావం,ఆరోగ్య సమస్యలు,ఆకలితో అలమటిస్తూ మృతి చెందినట్టు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.



