Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్హక్కులడిగిన ప్రజల మనిషి

హక్కులడిగిన ప్రజల మనిషి

- Advertisement -

పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు
కాళోజి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి  

రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి నారాయణరావు అని, ప్రజల హక్కులను అడిగిన పద్మ విభీషణ్ కాలోజీ నారాయణరావు అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే ఆయన సేవలను గుర్తు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో కాళోజీ జన్మించారని తెలిపారు. ప్రజాకవి, ఉద్యమం నడిపిన ప్రజావాది అయినా కాళోజి ప్రజల హక్కుల కోసం పోరాడారన్నారు. తెలంగాణ జీవిత చలనశీలి పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడన్నారు. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తి ఎన్నో రచనలు చేశాడని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడని, అతనికి 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడని తెలిపారు. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించిందన్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచిన గొప్ప కవి ఆయనని పేర్కొన్నారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట అన్నారు. నా గొడవ పేరిట పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించిన మహా వైతాళికుడు కాళోజీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

 క్యాంపు కార్యాలయంలో ఘనంగా కాలోజీ జయంతి

తెలంగాణ భాష దినోత్సవం, ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పి ఏ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేడు తెలంగాణ భాషా దినోత్సవం (ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి) మన తెలంగాణ భాషను, యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల పలుకుబడుల భాషకు పట్టం కట్టాలని నినదించిన ప్రజాకవి ప్రజల్లో చైతన్య దీప్తిని వెలిగించి జీవితాంతం వారి గొంతుకగా బతికిన కాళోజీ చిరస్మరణీయులన్నారు.

 ఈ కార్యక్రమంలో రేవల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నక్క రాములు, టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్, మాజీ కౌన్సిలర్ చుక్క రాజు,శ్రీనివాస చారి,మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అయుబ్ ఖాన్,యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ అంబటి రమేష్ ప్రసాద్ చెవ్వ శివ యాదవ్, నాని నరేష్, గొర్ల అనిల్,గంధం మహేష్, మురళి,సురేందర్ గౌడ్, ఎండి ఆరిఫ్,ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad