Wednesday, January 14, 2026
E-PAPER
Homeక్రైమ్బుద్వేల్‌ ప్లాస్టిక్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

బుద్వేల్‌ ప్లాస్టిక్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

– ఎలాంటి అనుమతులు లేకుండా గోదాం నిర్వహణ
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని బుద్వేల్‌లో మంగళవారం ఉదయం ఒక ప్లాస్టిక్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు, ఫైర్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బుద్వేల్‌ నుంచి కిస్మత్‌పూర్‌ వెళ్లే ప్రధాన రహదారి పక్కన కొంతకాలం నుంచి ఒక వ్యక్తి ప్లాస్టిక్‌ గోదాన్ని నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఆ గోదాంలో నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ప్లాస్టిక్‌ నిలువలు పెద్దఎత్తున ఉండటంతో మంటలు క్షణాల్లో గోదాం మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది నాలుగు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ సురేందర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని అన్ని శాఖల అధికారులకు సమాచారం అందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -