Wednesday, December 24, 2025
E-PAPER
Homeక్రైమ్ఫర్నీచర్‌ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

ఫర్నీచర్‌ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

ప్రారంభానికి ముందే తీవ్ర నష్టం
నవతెలంగాణ-ఉప్పల్‌

మేడ్చల్‌ మల్కాజిగరి జిల్లా ఉప్పల్‌ భగాయత్‌ ప్రాంతంలోని లింమ్రా ఫర్నీచర్‌ అండ్‌ సోఫా వర్క్‌షాప్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ షాప్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో షాప్‌లో వెల్డింగ్‌ పనులు జరుగుతున్న సమయంలో స్పార్క్‌ ఫోమ్‌ను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరుపులు, ఫర్నిచర్‌ సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది, హైడ్రా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. షాప్‌కు ఆనుకుని అపార్ట్‌మెంట్లు ఉండటంతో మంటలు వ్యాప్తితో వారంతా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. షాప్‌ ప్రారంభోత్సవం జరగకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -