Tuesday, April 7, 2026
E-PAPER
Homeఆటలువరుణుడి ఖాతాలో ఓ మ్యాచ్‌

వరుణుడి ఖాతాలో ఓ మ్యాచ్‌

- Advertisement -

కోల్‌కతా, పంజాబ్‌ మ్యాచ్‌ వర్షార్పణం
నవతెలంగాణ-కోల్‌కతా :
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో ఓ మ్యాచ్‌ వరుణుడి ఖాతాలో పడింది. హ్యాట్రిక్‌ విజయాలపై కన్నేసి ఈడెన్‌గార్డెన్స్‌లో అడుగుపెట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 3.4 ఓవర్లలో 2 వికెట్లకు 25 పరుగులు చేసింది. అజింక్య రహానె (8 నాటౌట్‌), రఘువంశీ (7 నాటౌట్‌) అజేయంగా నిలువగా.. ఫిన్‌ అలెన్‌ (6), కామెరూన్‌ గ్రీన్‌ (4) వికెట్లు కోల్పోయారు. పవర్‌ప్లేలోనే వరుణుడు రంగ ప్రవేశం చేయటంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. రాత్రి 10.45 గంటల సమయంలో వర్షం నిలిచిపోగా.. పిచ్‌ను సిద్ధం చేసేందుకు గ్రౌండ్‌ సిబ్బంది కఠోరంగా శ్రమించారు. సూపర్‌సోపర్లతో నీటిని తోడేందుకు చెమటోడ్చారు. 11.14 గంటలకు కుదించిన ఓవర్లతో మ్యాచ్‌ మొదలవుతుందని ఆశించగా.. నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు ఫీల్డ్‌ అంపైర్లు, ఫోర్త్‌ అంపైర్‌తో మాట్లాడిన అనంతరం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చెరో పాయింట్‌ పంచుకున్నాయి. ఫలితం తేలని మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ పాయింట్ల ఖాతా తెరిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -