‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్‌లోని మైత్రి విమల్ థియేటర్‌లో ఈ గీతావిష్కరణ వేడుక వైభవంగా జరిగింది.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, ‘ఈ పాటలో కళ్యాణ్‌తో కలిసి రాశీ అద్భుతంగా డ్యాన్స్ చేసింది.
1500-2000 మందితో భారీస్థాయిలో ఈ పాటను తెరకెక్కించాం. పవన్ కళ్యాణ్ వేసిన డ్యాన్స్‌కి చప్పట్లు, ఈలలతో సెట్ అంతా దద్దరిల్లిపోయింది. ఆయన ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో ఇంటెన్స్ సీన్స్‌లో ఆయన అద్భుతంగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు’ అని అన్నారు. ‘సినిమా చాలా బాగా వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ స్థాయికి తగ్గకూడదనే కసితో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. పవన్‌తో గుర్తుండి పోయే చిత్రం చేయాలని అందరూ కోరుకుంటారు. అలాంటి అద్భుతమైన చిత్రమిది ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పడిన కష్టం న భూతో న భవిష్యతి’ అని నిర్మాత రవిశంకర్ యలమంచిలి చెప్పారు.
అందరికీ గుర్తుండిపోయే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



