పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ప్రముఖులు విజ్ఞప్తి
నవతెలంగాణ – మద్నూర్
ప్రతి సంవత్సరం మద్నూర్ మండల కేంద్రంలో ప్రభాత్ పేరి భజన కార్యక్రమాలు నెల రోజులపాటు కొనసాగుతాయి. ఈ ప్రభాత్ పేరి కార్యక్రమం ఈనెల 7న ప్రారంభమవుతుందని ప్రముఖులు తెలిపారు. ప్రతిరోజు మండల కేంద్రంలోని బాలాజీ మందిరంలో ఉదయం ఐదు గంటలకు ప్రభాత్ పేరి ప్రారంభమవుతుంది. అక్కడ ప్రతిరోజు బాలాజీ ఆలయంలో భగవంతుని నామస్మరణ సూత్రాలతో పూజించిన అనంతరం గ్రామంలోని వాడవాడల్లో గల ఆలయాలకు భజన కార్యక్రమం ద్వారా ప్రభాత్ పేరీ చేరుకుంటుంది. ఆలయాల్లో ప్రదక్షిణాలు హారతి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది ఈనెల 7న ప్రారంభమయ్యే ప్రభాత్ పేరీ భజన ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రముఖులు కోరుతున్నారు.
మద్నూర్ లో నెల రోజులపాటు ప్రభాత్ పేరి కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES