Sunday, November 16, 2025
E-PAPER
Homeవరంగల్గాలివాన బీభత్సంతో నెలమట్టమైన చింతచెట్టు.!

గాలివాన బీభత్సంతో నెలమట్టమైన చింతచెట్టు.!

- Advertisement -

విరిగిన విద్యుత్ స్తంభం,కూలిన ఇల్లు
విద్యుత్ సరపరాకు అంతరాయం.
నవతెలంగాణ-మల్హర్ రావు.

గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలం ఆన్ సాన్ పల్లిలో గ్రామంలో ప్రధాన రహదారి ప్రక్కనున్న యాభై ఏళ్లనాటి చింతచెట్టు నేలమట్టమైoది.చెట్టు కూలిపోవడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయి,విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి,ప్రక్కునున్న నర్శిన శివశంకర్ ఇంటిపై చెట్టు పడటంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది.చెట్టు కూలే సమయంలో ఎవరు రాకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ గ్రామానికి ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు మాత్రం అంతరాయం కలిగింది.విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామంతా చికటిమయంగా మారింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -