మృతురాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
బోడుప్పల్‌లో నివాసం
నవతెలంగాణ-బేగంపేట
హైదరాబాద్ చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంఎటీఎస్ డౌన్ లైన్‌లో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి చర్లపల్లి సెక్షన్ పరిధిలోని కిలోమీటర్ నంబర్ 206/48 వద్ద సనత్‌నగర్ వైపు వెళ్తున్న గూడ్స్‌కు అడ్డంగా ముగ్గురు వ్యక్తులు పరుగెత్తుకుంటూ వచ్చి రైలు కింద పడ్డారు. ఈ విషయాన్ని గూడ్స్ రైలు లోకో పైలట్ సుషైన్ మహతో వాకీటాకీ ద్వారా జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఐపీఎఫ్ చర్లపల్లి ఏఎస్‌ఐ బిఎస్.రావు, జీఆర్‌పీ సిబ్బంది శ్రీసాయి ఈశ్వర్ గౌడ్, ఎస్‌ఐ మాధవ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రైల్వే పట్టాల మధ్య ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మృతులను బోడుప్పల్ హరితవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయ ఎలియాస్ విజయశాంతిరెడ్డి(38), ఆమె కూతురు చైతన్యరెడ్డి(18), కుమారుడు విశాల్‌రెడ్డి(17)గా గుర్తించారు. విజయశాంతిరెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా సమాచారం. గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇది ఆత్మహత్య ఘటనగా పోలీసులు నిర్ధారించారు. మృతుల వద్ద ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేకపోవడంతోపాటు విలువైన వస్తువులు కూడా ఏమీ లభించలేదని జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపారు. అనంతరం ఆర్పీఎఫ్, జీఆర్‌పీ సంయుక్తంగా జాయింట్ ఆబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేసి, మతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జీఆర్‌పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
రైలు కింద పడి తల్లి,ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



