సిపిఐ రాష్ట్ర నాయకులు హెచ్ ఆనంద్ జి, కొమ్ము భరత్ పిలుపు..
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మనువాద సిద్ధాంతం వలన ఫాస్టెస్ట్ విధానాల వలన దేశంలో బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, రాజ్యాంగం, సామాజిక న్యాయం ప్రమాదంలో ఉన్నాయని వాటిని సమాధి చేయడానికి బిజెపి కుయుక్తులు పన్నుతుందని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు హెచ్ ఆనంద్ జి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్ పేర్కొన్నారు. ఆదివారం సిపిఐ 25వ జాతీయ మహాసభల జయపదాన్ని కాంక్షిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ ను హెచ్ ఆనంద్ జి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్, సిపిఐ రాష్ట్ర నాయకులు హెచ్ ఆనంద్ జి మాట్లాడుతూ దేశంలో సాహూసవపేత నిర్ణయాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రజలు పార్టీ శ్రేణులు తీసుకోవడం గొప్ప స్వగదించిందన్నారు. ఇటీవల వరదలు అకాల వర్షాలు పంటలు నష్ట పోవడం పంజాబ్ లో జరిగిందన్నారు.
పంజాబ్ హర్యానా ఉమ్మడి రాష్ట్రం రాజధాని చండీగఢ్లో ఈ వాతావరణ పరిస్థితుల్లో మహా జాతీయ మహాసభలు నిర్వహించ తలపెట్టడం అక్కడి పార్టీ శ్రేణులు ప్రజలు ముందుకు రావడం గొప్ప స్వాగతం పలకడమన్నారు. పంజాబ్ కు గొప్ప చరిత్ర వుంది. ఒకనాటి ఉద్యమంలో గదర్ ఉద్యమం నాయకులు సోహన్ సింగ్ నాయకత్వం మించిన చరిత్ర పంజాబ్ లో ఉన్నది. అలాగే మిలియన్ బాగ్ చరిత్ర లో ఎంతో మందిని హతమార్చిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాహసోపేత ప్రతికరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉద్ధం సింగ్ చరిత్ర నాడు జరిగిందా చరిత్ర పంజాబ్ లో ఉన్నది. అలాగే ఇంక్విలాబ్ జిందాబాద్ చిన్న వయసులో దేశ స్వతంత్రం కోసం ఉరి కంబాలెక్కిన నునుగు మీసాల వ్యక్తి భగత్ సింగ్ చరిత్ర కలిగిన రాష్ట్రం పంజాబ్ అన్నారు. అలాగే ఇటీవల జరిగిన రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పైగా సాగిన ఉద్యమంలో 756 మంది మరణించిన చరిత్ర నాయకత్వం వహించినటువంటి గొప్ప రైతు నాయకులు పంజాబ్ రైతులని అన్నారు.
నేడు ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అత్యధికంగా ప్రజల పైన భారాలు మోపుతూ కనీస ధరలు వస్తువులు పెంచుతూ జీఎస్టీ పేరు మీద ధరలు వేయించుతూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరిస్తూ పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులకు దక్కకుండా 12 గంటలకు పెంచడం దారుణం అన్నారు. రైతు గిట్టుబాటు ధరకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందన్నారు. సామ్రాజ్యవాదులు విదేశీ పెట్టుబడిదారులు సొదసి పెట్టుబడులతో గార్లతో చేతులు కలిపి దేశ రైతాంగాన్ని ప్రజలను నయవంచన గురిచేస్తుంది బిజెపి ప్రభుత్వం అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో దళితులు ఆదివాసీలు మైనార్టీలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందన్నారు.
ఈ నేపథ్యంలో పేరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా రైతాంగ సమస్యల పరిష్కారానికి అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణకు, పరిరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు, అమాజిక న్యాయం కోసం ఈ మహాసభల్లో పూర్తిస్థాయిలో సమీక్షలు జరిపి గొప్ప పోరాట కార్యాచరణ నిర్వహించబోతుందన్నారు. మూడేళ్ల కోసం జరిగే మహాసభల్లో గత మూడు సంవత్సరాలుగా అయినటువంటి పోరాటంలో సాధించిన విజయాలు వైఫల్యాలపై సమీక్షించుకొని భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అలాగే నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
నేడు మహాసభల ప్రారంభ దినోత్సవం సందర్భంగా ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాసభల జయ ప్రధాని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని గ్రామాలలోని మండలాలలో జెండా ఆవిష్కరణలు బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ జి, సభాధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సూర్య శంకర్ గౌడ్, మర్యాద వెంకటయ్య, బండి లక్ష్మీపతి, మారేడు శివశంకర్, వ్యాకాస జిల్లా అధ్యక్షులు రవీందర్, డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు చిన్నపాక శ్రీనివాసులు, వెంకటస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శివకృష్ణ, న్యాయవాది బిక్షపతి, నాయకులు అభి, రాహుల్, రాజు, బహుగుణ, అనిల్, స్వామి తదితరులు పాల్గొన్నారు.