హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావి పూడి కలకయిలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఇందులో హీరో వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథనాయికగా నటిస్తుండగా, అర్చన సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల మీడియాతో ముచ్చటించారు.
అద్భుతంగా ఉంటుంది
సెన్సార్ పూర్తయ్యింది. చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. సినిమాని చాలా ఎంజారు చేశారు. క్లిన్ ఫిల్మ్. ఫుల్ ఫ్యామిలీ ఫన్. పిల్లలు, ఫ్యామిలీతో కలసి అందరూ చూసే సినిమా అని చెప్పారు. ఇద్దరు పెద్ద స్టార్స్ కలిసి చేసిన సినిమా ఇది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇద్దరి అభిమానులు ఎంజారు చేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాఇయ. థియేటర్స్ ఇబ్బంది ఉంటుంది కదా అని అంటున్నారు.అయితే
మాకు రన్నింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సంక్రాంతిలో ముందు నుంచి మా సినిమా ఉంది. అయితే ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఒకటో అర థియేటర్స్ తగ్గడం సహజమే. కాకపోతే మా సినిమా వరకూ థియేటర్స్ సమస్య పెద్దగా లేదు. ట్రైలర్‌లో చిరంజీవి క్యారెక్టర్‌కి సంబంధించి షేడ్స్ చూపించాం. ఆయన క్యారెక్టర్‌లో ఫన్, యాక్షన్, ఎమోషన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. వెంకటేష్, చిరంజీవి మధ్య చాలా అద్భుతమైన కామెడీ సీన్స్ ఉంటాయి. ట్రైలర్ జస్ట్ సాంపిల్ మాత్రమే. ట్రైలర్‌లో చిరంజీవి క్యారెక్టర్ పరిచయం మాత్రమే చేశాం. సినిమాలో చాలా ఉంది. ఈ సినిమా సంక్రాంతి విందు అనేది చిన్న మాట.. సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. అద్భుతంగా ఉంటుంది.
– నిర్మాత సాహు గారపాటి
సరికొత్త చిరంజీవిని చూస్తారు
ఇది నాకు మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేయడం ఒగ గౌరవంగా భావిస్తున్నాను. నాన్న కోర్ జోనర్‌లో చేయడం, అనిల్ ఆ జోనర్‌ని తీసుకోవడం సూపర్బ్. సాహుతో జర్నీ బ్యూటీఫుల్. ఇది చాలా ఎంజారు చేస్తూ చేసిన మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్ మళ్ళీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో నాన్న ఒక కొత్త ట్యాలెంట్ బాక్స్‌ని ఓపెన్ చేసినట్లుగా అనిపించింది. ‘రౌడీ అల్లుడు’ సినిమాలో చూసినట్లుగా ఉందని ఫ్యాన్స్ అంటు న్నారు. వింటేజ్ ఛార్మ్‌ని గుర్తు చేస్తూనే ఇందులో ఆయన నటన చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నాన్న బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దష్టి పెట్టారు. చాలా కొత్త ఛార్మ్‌తో కనిపించారు. దీంతో ఆయనకి కాస్ట్యుమ్స్ డిజైన్ చేయడం కూడా మాకు ఈజీ అయ్యింది. అలాగే అనిల్ ఆయన్ని ఒక స్టయిల్‌లో చూపించాలని అనుకున్నారు. ఆయన వైపు నుంచి కూడా చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు. అందరం ఒకే విజన్‌తో పని చేశాం. వెంకటేష్ బిగ్ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఫన్ మరింతగా రైజ్ అవుతుంది.
– నిర్మాత సుస్మిత కొణిదెల



