సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. వారణాసి హీరోయిన్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాను ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ధీరజ్ మొగిలినేని మీడియాతో ముచ్చటించారు.
-ఈ సినిమా చూశాను. మూవీ బాగా నచ్చింది. ప్రమోద్, వంశీకి కాల్ చేసి ఈ సినిమా నేను డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నా అని అడిగాను. వారు ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. ఇది చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే మంచి లవ్‌స్టోరీ. టైటిల్ చూసి ఇదోదే ఓన్లీ యూత్ చూడాల్సిన సినిమా అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. శివ, మిత్ర అనే రెండు క్యారెక్టర్ల అద్భుతమైన జర్నీ చూస్తారు.
-ఈ మూవీలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి కేవలం 15 నిమిషాలు మాత్రమే సీన్స్ ఉంటాయి. మిగతా అంతా మిత్ర, శివ అనే జంట ఒకరికొకరు పరిచయం అయ్యాక, వారి జీవితాలు ఎలా మారాయి?, వీళ్లు ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు అనేదే చూపిస్తున్నాం. హీరో నెల్లూరు నుంచి వచ్చి చెన్నైలో ఇంటీరియర్ డిజైనర్‌గా సెటిల్ అవ్వాలని వస్తాడు. హీరోయిన్ చిత్తూరు నుంచి చెన్నై జాబ్ కోసం వస్తుంది. వీళ్లు కలిశాక ఏమైంది అనేది కథ.
-శివ పాత్రలో సంతోష్ శోభన్ పర్‌ఫార్మెన్స్ మనందరికీ చాలా నచ్చుతుంది. ఎంతో సెటిల్డ్‌గా ఆయన నటించారు. సంతోష్ శోభన్‌కు మంచి హిట్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ సినిమాతో ఆయనకు హిట్ రావాలి. అలాగే మంచి స్టార్ కావాలని మేము కోరుకుంటున్నాం. సంతోష్ లాంటి యంగ్ హీరోలకు సక్సెస్ వస్తే వాళ్లు మరిన్ని మూవీస్ చేస్తారు. ఇండస్ట్రీ బాగుంటుంది.
-ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండే మంచి లవ్ స్టోరీ. మేము మా చిత్రాలతో ప్రేక్షకులను ఎమోషన్‌తో ఏడిపిస్తాం. అయితే ఈ దర్శకుడు అశ్వన్ ప్రేక్షకుల్ని ఏడిపించలేదు గానీ హార్ట్ టచింగ్‌గా మూవీ చేశారు. ఆయన ఈ సినిమాకు చేసిన స్క్రిప్ట్ పర్పెక్ట్‌గా ఉంది. ప్రతి సీన్‌కు మరొక సీన్‌తో లింకు ఉండేలా పక్కాగా స్క్రిప్ట్ చేసుకున్నారు. స్క్రిప్ట్‌తో పాటు ఆ కథను అందరికీ నచ్చేలా తెరకెక్కించారు.
-ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్ జరుగుతోంది. సంగీత్ శోభన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అలాగే చిన్న పిల్లలతో ఓ చిల్డ్రన్ మూవీ చేస్తున్నాం. అది సమ్మర్‌లో రిలీజ్ చేస్తాం. కొందరు స్టార్ హీరోలతో స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఒక స్టార్‌తో మా సంస్థలో మూవీ అనౌన్స్ చేస్తాం.
అందర్నీ అలరించే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



