Monday, March 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయావత్‌ దేశం మాట్లాడుకునే సినిమా

యావత్‌ దేశం మాట్లాడుకునే సినిమా

- Advertisement -

హీరో శర్వా, అతభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్‌ రేసింగ్‌ డ్రామా ‘బైకర్‌’. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్‌ అడ్వంచరస్‌ చిత్రంగా రూపొందుతున్న బైకర్‌ ఏప్రిల్‌ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, ఇపిఐక్యు, 4డీఎక్స్‌, పీసీఎక్స్‌ వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఆదివారం మేకర్స్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. హీరో శర్వా మాట్లాడుతూ,’రాజశేఖర్‌ ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్‌. దిల్‌ రాజు చెప్పినట్లు నిర్మాతలు దగ్గరుండి కథలు రాయించి సినిమాలు చేస్తే ఖచ్చితంగా మంచి విజయవంతమైన చిత్రాలు వస్తాయి. నాకు బాగా గుర్తు ‘శతమానం భవతి’ సినిమా సమయంలో దిల్‌ రాజు దగ్గరుండి పాటలు రాయించుకునేవారు. అలాంటి డెడికేషన్‌ ఉన్న ప్రొడ్యూసర్స్‌ పరిశ్రమకు కావాలి.

వంశి కూడా తనకు కావలసిన సాంగ్స్‌ని దగ్గరుండి రాయించుకుంటారు. బైకర్‌ సినిమా గురించి ఒకటే మాట చెప్తాను.. మొన్న చెప్పి హిట్టు కొట్టాను.(నారీనారీ నడుమమురారి) ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను. ఈసారి బైకర్‌తో బంపర్‌ బ్లాక్‌ బాస్టర్‌ కొడుతున్నాను. ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా తీశాం’ అని అన్నారు. ‘ఇందులో క్యారెక్టర్‌ నాకు చాలా నచ్చింది. యు వి క్రియేషన్స్‌ ట్రీట్మెంట్‌ అద్భుతం నేను హీరోలాగే వెళ్ళాను. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని రాజశేఖర్‌ చెప్పారు. డైరెక్టర్‌ అభిలాష్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా సౌండ్‌ డిజైన్‌ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడారు. మేము ఆశించిన స్థాయిలోఆడియన్స్‌కి రీచ్‌ అయింది’ అని అన్నారు. ‘ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వచ్చి చాలా రోజులైంది. కచ్చితంగా ఈ సినిమా ఒక కొత్త ఎక్స్పీరియన్స్‌ ఇస్తుంది’ అని బన్నీ వాసు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -